ర్యాగింగ్‌కు నిరసనగా విద్యార్థుల రాస్తారోకో

ర్యాగింగ్‌కు నిరసనగా విద్యార్థుల రాస్తారోకో

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్‌కు నిరసనగా జూనియర్ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. కళాశాలలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌ను నిరసిస్తూ జూనియర్ విద్యార్థులు 161వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సోమవారం రెండో సంవత్సరం ఈఈఈ చదువుతున్న ఓ విద్యార్థినిని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు జూనియర్ విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన స్పందన రాలేదని వారు పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు మంగళవారం కళాశాల క్యాంపస్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం విద్యార్థులు 161వ జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కళాశాలలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

WhatsApp Image 2026-09-29 at 2.12.25 PM

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News