ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

  • స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే.
  • పాఠశాలలో మౌలిక వసతులు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం నిర్వాణపై ఎమ్మెల్యే ఆరా.

తాండూరు (వికారాబాద్ జిల్లా)తాండూర్ మున్సిపల్ పరిధిలోని 1 నుంచి 6వ వార్డుల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తరగతుల నిర్వహణ తదితర అంశాలపై ఎమ్మెల్యే స్వయంగా  అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, భోజనం నాణ్యత, బోధన, తరగతుల నిర్వహణపై వారి అభిప్రాయాల ను తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్, కమీషనర్, నాయకులు అధికారులు ఉన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News