ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థి కాలుపై నుంచి వెళ్లిన బస్ టైర్
హత్నూర : ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్థి బస్సు చక్రం వెళ్లి కాలు వేలు విరిగి తీవ్ర గాయాలైన సంఘటన హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ లోని సాయి రిషి ఒకేషనల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి సోమవారం మధ్యా హ్నం కళాశాల తరగతులు ముగిసిన తర్వాత స్వగ్రాహానికి తిరిగి వెళుతున్నందున దౌల్తాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో నర్సాపూర్ బస్ కోసం వేచి ఉంది జోగిపేట్ నర్సాపూర్ బస్ ఎక్కేందుకు నిలబడి ఉన్న ఆ విద్యార్థి కాలు పై నుండి బస్ టైర్ వెళ్లి కాలు తీవ్ర గాయాలయ్యాయి కాగా అది గమనించిన తోటి విద్యార్థులు మొదటి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం సంగారెడ్డి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే కాలుపై బస్సు వెళ్లిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


