నక్షా బాట పరిరక్షణకు ఎంఆర్‌ఓకు వినతిపత్రం 

నక్షా బాట పరిరక్షణకు ఎంఆర్‌ఓకు వినతిపత్రం 

చౌటకూర్,  : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి సంబంధించిన తద్దాన్‌పల్లి–సుల్తాన్‌పూర్ మధ్య ఉన్న నక్షా బాట సమస్యను పరిష్కరించి, బాటను పరిరక్షించాలని కోరుతూ గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు మంగళవారం ఎంఆర్‌ఓ అనుదీప్‌కు వినతిపత్రం అందజేశారు.సుల్తాన్‌పూర్ గ్రామానికి సంబంధించిన నక్షా బాటను పరిరక్షించి, భవిష్యత్‌లో రైతులు, గ్రామ ప్రజలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. నక్షా బాటకు సంబంధించిన సమస్యను పరిశీలించి, నిబంధనల ప్రకారంతగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంఆర్‌ఓ అనుదీప్ సానుకూలంగా స్పందించి, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సుల్తాన్‌పూర్ గ్రామ సర్పంచ్ గీతారాణి రమేష్, ఉపసర్పంచ్ మహేష్, వార్డు సభ్యుడు చిన్నం రెడ్డి, గ్రామ కార్యకర్త వెంకట్ రెడ్డితో పాటు గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News