కోర్పోల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని కోర్పోల్ గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా కోర్పోల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ‘వికసిత భారత్’, జాతీయవాదం తదితర అంశాలపై విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డిక్షనరీలను బహుమతులుగా అందజేశారు. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు నీతి కథలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోర్పోల్ బీజేపీ నాయకులు, మాజీ సర్పంచ్ కౌలగారి నరసింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చందాపురం ముకుందం, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు సార రాజ్‌కుమార్, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి పొట్టి మోహన్ ముదిరాజ్, బసవన్నగారి వెంకట్‌రెడ్డి, చందాపురం రమేష్, వార్డు సభ్యులు జిల్లా మమతా మల్లేశం, బేగరి మాణిక్యం, భానుతేజ, బీజేవైఎం నాయకులు ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, విద్యతో పాటు విలువలు, వ్యక్తిత్వ వికాసం, దేశం పట్ల బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు భవిష్యత్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


