ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.

ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.

కలెక్టర్ రాజర్షి షా, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

ఆదిలాబాద్ బ్యూరో: 2026–27 ఖరీఫ్ పత్తి మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, అధికారులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, సీసీఐ, ఏఎంసీ కార్యదర్శులు, మిల్లుల యజమానులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పత్తి నిల్వలు గోదాములు, మార్కెట్ ప్రాంగణాల్లో ఉండే నేపథ్యంలో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా పత్తి విక్రయానికి వచ్చే మహిళా రైతులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్‌లో ప్రత్యేక మహిళా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల భద్రత, పారదర్శకత కోసం మార్కెట్ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు మున్సిపాలిటీ తరఫున అవసరమైన సహకారం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News