సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
హైదరాబాద్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టనున్న బీసీ రాజ్యాధికార పాదయాత్ర సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 8:00 గంటలకు హైదరాబాద్‌లోని గోల్కొండ కోట నుండి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వర్గాల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సామాజిక న్యాయం మరియు రాజ్యాధికార సాధన లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి పార్టీ రాష్ట్ర నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు, మేధావులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


