చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
- అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలి.
- ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచన.
ఆదిలాబాద్ : గణపతి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా చాంద టి* వద్ద నిమజ్జన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆప్యాయతతో ఎస్పీకి గణపతి నిమజ్జన పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


