గ్రామ అభివృద్ధి పేరుతో వీడీసీలు అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు
- బరంపూర్ గ్రామంలో అక్రమ బెల్ట్ షాపు నిర్వహణపై కేసు నమోదు.
- రూ.12 లక్షలు డిమాండ్, ఆరుగురు వీడీసీ సభ్యులపై కేసు.
- అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అదుపులోకి తీసుకుని, రూ.3.29 లక్షల విలువైన మద్యం స్వాధీనం.
- గతంలో సైతం అక్రమ వసూళ్లకు పాల్పడిన వీడీసీలపై కేసులు నమోదు, అరెస్టు
- ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి
ఆదిలాబాద్ బెల్ట్ షాపులు, ఇసుక అక్రమ రవాణా, కల్లు దుకాణాలు తదితర అక్రమ కార్యకలాపాలను గ్రామ అభివృద్ధి పేరుతో గ్రామాల్లో ఎవరైనా అక్రమ వసూళ్లకు, వీడీసీలు వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. గ్రామ అభివృద్ధి పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం, ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని బరంపూర్ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్‌ఐ డి. రాధిక తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్లీ-కే గ్రామానికి చెందిన నిందితుడు చిత్తల వెంకట్ రెడ్డి (48) ని అదుపులోకి తీసుకున్నారు.వీడీసీ సభ్యులుగా పేర్కొన్న వారు:
1. కస్లాల ప్రతాప్
2. మెర్గు రంజిత్ రెడ్డి
3. పట్ల నర్సయ్య
4. మేకల బాపురావు
5. గణేష్ గౌడ్
6. మాధురి మల్లేష్
అందరూ బరంపూర్ గ్రామం.నిందితుడి వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 454 లీటర్ల 910 ఎంఎల్ మద్యం, సుమారు రూ.3,29,190 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిందితుడి తెలియజేసిన వివరాల ప్రకారం బరంపూర్ గ్రామానికి చెందిన కొందరు వీడీసీ సభ్యులు బెల్ట్ షాపు నిర్వహించాలంటే రూ.12 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు, అందులోభాగంగా రూ.10,000 అడ్వాన్స్‌గా చెల్లించినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలపై సంబంధిత ఆరుగురు వీడీసీ సభ్యులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామాల్లో వీడీసీల పేరుతో ఎవరైనా బెల్ట్ షాపులు, ఇసుక అక్రమ రవాణా, కల్లు దుకాణాలు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించి వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై తాలమడుగు పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 34(A) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్, సెక్షన్ 308(2) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాలు, అక్రమ వసూళ్లు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


