మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలి
నిజామాబాద్ : నిజామాబాద్ నగర ప్లాన్లు లో అనేక ఒక తప్పుడు జరిగాయని పౌర సమాజం సూచనలు సలహాలు అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా గత ప్రభుత్వం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని, తక్షణమే ఆ మార్పులు అభ్యంతరాలను పరిష్కారం చేసిన తర్వాతనే మాస్టర్ ప్లాన్ ను ఆమోదించాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ,బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ నగరాభివృద్ధి కమిటీ విజ్ఞప్తి చేసింది. మాధవనగరం రైల్వే ఓవర్ బ్రిడ్జి త్వరగా పూర్తి చేయించాలనీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని వారు తెలిపారు. సుదర్శన్ రెడ్డిని కలిసిన వారిలో అధ్యక్షులు ఆకుల ప్రసాద్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, నగర అభివృద్ధి కమిటీ నాయకులు ప్రభాకర్, పెన్షనర్స్ యూనియన్ నాయకులు ఈవీఎల్ నారాయణ, సిర్ప హనుమాన్లు, ప్రసాద్ రావు, సాంబశివరావు, రాజు,బలన్న,శ్రీహరి తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


