మల్లంపల్లిలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు డిమాండ్
వినతి పత్రం అందజేసిన బైకాని మహేందర్
ములుగు : సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ మల్లంపల్లి మండల అధ్యక్షులు బైకాని మహేందర్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినోత్సవానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందని, తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించి, విద్యార్థులు, యువతలో చైతన్యం నింపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు బండి బాబు, ప్రధాన కార్యదర్శి ఎండిగా రాజు, కార్యదర్శి పోతురాజు సంపత్, బయ్యా రాజేందర్, గుగులోత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


