పదాల స్నేహం
మనిషికి భావాలను వ్యక్త
పర్చడానికి భాష వారధి
అనువాద ప్రక్రియ
భాషలు వేరైన గాని
భావం ఒక్కటే
మాటల దూరం తగ్గిస్తూ
మనసులను కలిపేది
వేర్వేరు లిపుల వెనుక
దాగిన స్పందన ఒకటే
అనువాద సంస్కృతి ఒకరి
గుండె చప్పుడు ఇంకొకరికి
వినిపిస్తూ
ఒక దేశపు సాహితీ సంస్కృతి
పరిమళాన్ని జగమంతా
వెదజల్లుతూ భావ విప్లవ దీప్తి
అనువాద ప్రక్రియ
పదాల వెనుక దాగివున్న ఆత్మను
పట్టుకొని మరో భాషలోకి జీవాన్ని
పోషేదే అనువాదం
ఒకరి మనసులోని
మాటను ఇంకొకరికి తెలిపే
శక్తి అనువాదానికి ఉంటుంది
అక్షరాలను కలిపి ఉంచేశక్తి
జగమంతా ఒకటే అంటూ
జ్ఞానాన్నీ పెంచే మార్గం
అనువాదమే భాషల
అమృత కావ్యం
జ్ఞాన దీపాన్ని లోకానికి పంచుతూ
సాహితీ హృదయాలను కలుపుతూ అనువాదకులు నిర్మించే అక్షరవారథి
పరిజ్ఞాన పరివ్యాప్తి సారధి
మానవత్వాన్ని ఏకం చేసే
మహోన్నత సాధనం
భాషల దూరాన్ని తగ్గించే
అనువాద ప్రక్రియ నిత్యం
వర్ధిల్లాలి ప్రపంచ మానవాళి
మనోభావాలను పరివ్యాప్తి
చేయడంలో అనువాదమే
ఆయుధం కావాలి
(సెప్టెంబర్30అంతర్జాతీయ అనువాద దినోత్సవం సందర్భంగా)
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
రచయిత కాలమిస్ట్
కరీంనగర్
9440245771
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


