గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడి టీచర్ల సేవలు ఎంతో కీలకమైనవి.

గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడి టీచర్ల సేవలు ఎంతో కీలకమైనవి.

నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఘనంగా అంగన్‌వాడీ టీచర్ల కు సన్మానం......

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం...: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం లో భాగంగా మంగళవారం నసురుల్లాబాద్ మండల కేంద్రం లో అంగన్‌వాడీ టీచర్లను ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు   అంగన్‌వాడీ టీచర్లను శాలువాల తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భం గా బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ. సమాజ నిర్మాణంలో, చిన్న పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణకు వారు చేస్తున్న సేవలు అమూల్య మైనవని ప్రశంసించారు.  సేవా సంకల్ప అభియాన్ ముఖ్య ఉద్దేశం సమాజం లో నిస్వార్థంగా సేవలందిస్తున్న వారిని గుర్తించి గౌరవించడ మేనని ఆయన పేర్కొన్నారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి, వారి కి మరింత భద్రత కల్పించేందుకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంద ని భరోసా ఇచ్చారు. ఈ సన్మానం వారి బాధ్యతను మరింత పెంచుతుందని, భవిష్యత్తు లో కూడా ఇదే ఉత్సాహం తో సేవలు అందించాల ని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో  మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు, లక్ష్మీ నారాయణ, వడ్ల సతీష్, లక్ష్మన్, నాగరాజు, శేఖర్, మలేష్, సుబ్రహ్మణ్య స్వామి, అతుకురు సాయిలు, సురేష్, వెంకన్న పవన్, తదితరులు  పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News