కష్టకాలంలో జర్నలిస్టుకు అండగా ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్
ప్రమాదంలో గాయపడిన సీనియర్ జర్నలిస్టు నాగరాజుకు రూ.22 వేల ఆర్థిక సాయం
మెట్‌పల్లి : జర్నలిస్టు కష్టాల్లో ఉంటే తామున్నామంటూ ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అండగా నిలిచింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నాగరాజును ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న నాగరాజుకు ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూ.22,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ప్రెస్ క్లబ్ ప్రతినిధులు.. మెరుగైన వైద్యం కోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూరం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ.. జర్నలిస్టు లు విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అలాంటి సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవడం జర్నలిస్టు సంఘాల బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐజేయు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఒక్కటిగా నిలిచిన జర్నలిస్టు సమాజం
తోటి జర్నలిస్టు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జర్నలిస్టు సమాజం ఒక్కటిగా స్పందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. నాగరాజు త్వరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూరం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్, గౌరవ సలహాదారు దాసం కిషన్, ఉపాధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్తో పాటు ప్రింట్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. నాగరాజుకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని వారు ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


