సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి.
- కరెంట్ కోతలు నివారించి రైతాంగాన్నీ ఆదుకోవాలని.
- సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య.....
నాగార్జునసాగర్ ; కేంద్ర ఎన్నికల సంఘంలో ఏకపక్ష నిర్ణయాలతో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర సభ్యులు నారీ ఐలయ్య డిమాండ్ చేశారు. నల్లగొండలో జరుగు రైతు సంఘం అఖిలభారత మహాసభలు జయప్రదం చేయాలని నిడమనూరు మండలంలోని ముకుందాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయనఈ సందర్భంగా మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న జ్ఞానేష్ కుమార్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ కాదని ఏకపక్ష నిర్ణయాలతో ఒక పార్టీకి ఏజెంట్ గా మారారని ఆరోపించారు.ఆయన ఏకపక్ష నిర్ణయాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.సర్ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓటర్ల తొలగింపు పై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయని అన్నారు.ఇవి ఏమి పట్టించుకోకుండా ముందుకు పోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు.ఫారం 6 మార్పులు ఓటర్ల జాబితా డేటా కేంద్రీకరణ పై ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు 14 సార్లు అభ్యంతరం వ్యక్తం చేసిన ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల వ్యవస్థ పైన చిత్తశుద్ధి ఉంటే జ్ఞానేష్ కుమార్ ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోతల్ని నివారించి 12 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కోరారు.ఒక పక్క ఎల్ నీనో మరోపక్క ప్రభుత్వ విధానాలు రైతులను అగాధంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితుల్లో రైతాంగని ఆదుకోవడం కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శీను,చౌగోని సీతారాములు,పోలగోని వరలక్ష్మి,పార్టీ నిడమనూరు మండల కార్యదర్శి కందుకూరి కోటేష్,మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురువయ్య,మళ్లీ కంటి చంద్రశేఖర్,కుంచెం శేఖర్,పాలో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


