చిలుపూరు గుట్టలో అష్టదళ పాద పద్మారాధన పూజ
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : జనగామ జిల్లా చిలుపూరు మండలంలోని ప్రసిద్ధ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి అష్టదళ పాద
పద్మారాధన పూజను అర్చకులు వైభవంగా నిర్వహించారు. బంగారు పద్మాలతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కిరణ్మయి దంపతులు రూ 516 చెల్లించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో లక్ష్మీ ప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ సీహెచ్ రాజేందర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు బి. రవీందర్ శర్మ, సౌమిత్రి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


