పనులు పూర్తి.. ప్రారంభం ఎప్పుడో..?
- ప్రారంభానికి నోచుకోని మరుగుదొడ్లు..
- ప్రజలకు తప్పని ఇబ్బందులు.. పట్టించుకునేది ఎవరు..?
- వినియోగంలోకి రాకపోవడంతో ప్రజలకు తప్పని అవస్థలు
సూర్యాపేట : పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, చిరు వ్యాపారులు, ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ పాత మున్సిపాలిటీ సమీపంలో ప్రజాధనంతో నిర్మించిన సౌకర్యాలు వినియోగంలోకి రాకపోవడం వల్ల వాటి ప్రయోజనం ప్రజలకు అందడం లేదని అభిప్రాయపడుతున్నారు.టాయిలెట్ నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ ప్రారంభించకపోవడానికి గల కారణాలు ఏమిటి ప్రారంభానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది. సంబంధిత అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి పబ్లిక్ టాయిలెట్‌ను అందుబాటులోకి తీసుకురా వాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


