జ్ఞానేష్ కుమార్ బీజేపీ తొత్తుగా మారి ఓట్ చోరీ
నిజామాబాద్ : జ్ఞానేష్ కుమార్ బీజేపీ తొత్తుగా మారి ఓట్ల చోరీ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం, కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఎఐసిసి పిలుపు టీపీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓట్ల చోరీ వ్యవహారంలో సిఇసి జ్ఞానేష్ కుమార్ తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలు నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి విచ్చేసి మాట్లాడారు.. భారతీయులమని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, బీజేపీ చేస్తున్న కుట్ర ఇది అని అన్నారు. ఎస్ ఐ ఆర్ ద్వారా దేశంలో, రాష్ట్రంలో కోట్లాది కోట్లు గల్లంతయ్య అన్నారు. తెలంగాణలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి వచ్చిన వారందరి ఓట్లు తీసేయడం సరికాదన్నారు. బిజెపి వారికి అవసరమైన ఓట్లు ఉంచుకొని మిగతా వారి ఓట్లు తొలగిస్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, పెళ్లయిన మహిళల ఓట్లు సైతం అత్తగారింట్లో చిన్న తప్పిదాలతో తీసివేయడం ఏంటని ప్రశ్నించారు. మోడీకి పెళ్లి అయి ఉంటే పెళ్లయినవారి ఓట్ల గురించి అర్థమయ్యేద న్నారు. ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ప్రతి ఇంటింటికి తిరిగి, ఇంటిలో అన్ని ఓట్లు వచ్చాయా లేదా తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఏ గ్రామంలోనైనా ఓట్లు మిస్ అయితే వారికి ఓటు వచ్చేలా చూడాలని, ఇది మనందరి బాధ్యత అన్నారు. కాంగ్రెస్ పార్టీ మన అందరి పార్టీ అని, రాహుల్ గాంధీ ని ప్రధానిగా చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామని, గత ప్రభుత్వం లక్షల కోట్లు బాకీలు చేస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపకుండా ముందుకు నడిపిస్తున్నారు అన్నారు. ఓట్ల చోరీ పై రాహుల్ గాంధీ పార్లమెంటులో ఆందోళన చేస్తున్న పట్టనట్టు వివరిస్తున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగిం చాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం మతాలు కులాల పేరుతో విభజించి పాలిస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్ ఐ ఆర్ ను తొలగించి అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామన్నారు. నిజా మాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి కార్పొరేటర్లు నిరసన తెలుపడం హాస్యస్పదంగా ఉందన్నారు. స్థానికంగా బిజెపి ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నప్పటికీ వారి నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. నిధులు తేవడం చేతకాక ధర్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బిజెపి కార్పొరేటర్ల నిరసన ను ఇప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నరాల రత్నాకర్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ కార్పొరేటర్లు నగర మేయర్ ఉమారాణి రమేష్ మనోహర్ పుప్పాల రవి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


