విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. ఏఐవైఎఫ్ నాయకులు ధర్నా

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. ఏఐవైఎఫ్ నాయకులు ధర్నా

సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ ను సిపిఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.... హాస్టల్లో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపించి మరుగుదొడ్లు పూర్తిగా చెడిపోయినవి గత రెండు మూడు నెలలుగా వాటిని క్లీన్ చేయడం లేదని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు తమ సమస్యలను వార్డెన్ కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, కే శ్రీనివాస్, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, జిల్లా సమితి సభ్యులు కలకొండ సంజీవ,మండల కార్యవర్గ సభ్యులు పల్లె మల్లారెడ్డి, వీరమల్ల యాదయ్య, పందుల యాదగిరి, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కొండూరు రవితేజ, సింగపంగా రమేష్,ఐతరాజ కిరణ్,హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 116

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News