ఆంధ్రా జలదోపిడిని అడ్డుకోలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం:మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి  :ఆంధ్రా జలదోపిడిని అడ్డుకోలేని  రేవంత్ రెడ్డి ప్రభుత్వమని  మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఎల్నినో పేరిట ఆంధ్రకు సాగు నీళ్లు దోచిపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఆరోపించారు.పోతిరెడ్డిపాడు కు వెళ్తున్నా ఆడుకుందుకు పోలీసుల తిరుకు నిరసనగా హైవేపై  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన వ్యక్తం  చేశారు.పోతిరెడ్డిపాడు కు వెళ్లి తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడదామని వెళ్తున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నీ జూపాడు బంగ్లా నేషనల్ హై వే వద్ద   ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ నీళ్ళు ఏపీ కి దోచిపెట్టే బానిస ప్రభుత్వం నడుస్తుందనీ,శ్రీశైలం ప్రాజెక్ట్ మీద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చూద్దామని వచ్చామన్నారు.ఏపీ లో కూడా పంటలు పండాలి అభ్యంతరం లేదన్నారు. కృష్ణా నదీ లో పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుంటున్నారు,గ్రావిటీతో నాలుగైదు టీ ఏం సి లు రోజు తీసుకుం టున్నారనీ, 802 మీటర్లు అడుగునా మా వైపు మోటార్ల తో ఎత్తిపోయాలన్నారు. మాకు  కెఎల్ ఐ లో మూడు పంప్ లు పని చేస్తాయనీ, 0.2 టి ఏం సి నీళ్ళు మాత్రమే ఎత్తి పోయాలన్నారు.ఐదారు రోజులు ఎత్తిపోస్తే ఒక టీ ఎంసి అవుతుందనీ, తెలంగాణ ప్రభుత్వం ఘోరమైన వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి వచ్చామన్నారు.ఎల్ నినో ప్రభావం రెండు రాష్ట్రాలకు ఒకేలా ఉంటుందనీ, తెలంగాణకు వేరే విధంగా ఉండదన్నారు.ఏపీ నీళ్ళు ఇస్తున్నపుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదన్నారు. ఆంధ్రా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వగలిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదనీ, కల్వకుర్తి మోటర్లు సరిగా నడపడం లేదన్నారు. మేము ఒత్తిడి తెచ్చేవరకు నీళ్ళు విడుదల చేయలేదనీ,162 కిలోమీటర్ల పొడవు ఉండే కాలువలో 102 కిలోమీటర్ల దూరం నీళ్ళు పోలేదన్నారు. జూరాల నుండి నిన్న కూడా ఎనబై వేల క్యూసెక్కులు శ్రీశైలం చేరుతున్నాయనీ, ఎగువ నుండి వరద ఎక్కువ వస్తుందన్నారు. జూరాల ఆయకట్టు , లిఫ్ట్ లకు నీళ్ళకు ఇబ్బంది లేదన్నారు.నిన్న ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ అడ్వైసరీ బోర్డు మీటింగ్ లో రైతులకు స్పష్టత ఇవ్వలేదనీ, ప్రజలకు వాస్తవాలు దాచిపెడుతున్నారనీ అన్నారు.మంచినీళ్లకు చెరువు లో నింపే నీళ్ళు అవసరం లేదనీ,రైతులకు సంబంధించిన ప్రాజెక్ట్ చూడటానికి ఇబ్బంది ఏంటి? ప్రశ్నిచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మేము వచ్చామని, పోతిరెడ్డిపాడు చూడొద్దని అపారు..శ్రీశైలం మీద ఆధారపడిన పంటలకు ఇబ్బంది లేదన్నారు. రైతులను వంచిస్తున్నారు. వానాకాలం పంటలకు నీళ్లు ఇచ్చేందుకు ఇబ్బంది లేదు. రీ జనరేటెడ్ వాటర్ మనకు వస్తాయన్నారు.జూరాల మీద ఆధారపడిన పంప్ లు ఆన్ ఆఫ్ పద్ధతిలో చేస్తాం. బీ ఆర్ఎస్ హయాంలో శ్రీశైలంలో వంద టీ ఏం సి లు ఉన్నపుడు కూడా నలభై టీ ఏం సి నీళ్ళు రైతులకు నీళ్ళు ఇచ్చామన్నారు. పోతిరెడ్డిపాడు నుండి ఎనిమిది తొమ్మిది వేల క్యూసెక్కులు నీళ్లు డ్రా చేస్తున్నామని చెప్తున్నారు, కానీ యాబై వేల క్యూసెక్కుల నీళ్లు డ్రా చేస్తున్నారనీ ఆరోపించారు. మేము ఆందోళన చేయడానికి.
నిరసన చేయట్లేదన్నారు.మనవి మనకు దక్కకుండా మన నీళ్ళు, వాళ్ళ నీళ్ళు Elbow వాళ్ళకు ఇస్తున్నారనీ అన్నారు .పాలమూరు జిల్లా కు నీళ్ళు దక్కకుండా చేస్తున్నారన్నారు.జిల్లా ఎమ్మెల్యే లకు,మంత్రులకు బాధ్యత లేదనీ మాజీమంత్రి నిరంజన్ రెడ్డి  ప్రశ్నించారు. 
 
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News