బైరు అనిత కుటుంబాన్ని పరామర్శించిన త్రిష

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం, ధైర్యం చెప్పిన మంత్రి దామోదర్ రాజనర్సింహ కుమార్తె త్రిష

బైరు అనిత కుటుంబాన్ని పరామర్శించిన త్రిష

చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని బద్రిగూడ గ్రామపంచాయతీలో ఇటీవల మృతి చెందిన బైరు అనిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కుమార్తె త్రిష పరామర్శించారు. అనిత మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె బుధవారం బాధిత కుటుంబ సభ్యులను నేరుగా కలసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా త్రిష బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, అధైర్యపడవద్దంటూ ధైర్యం చెప్పారు. అనిత మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి అవసరమైన ఇతర సహాయ సహకారాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. విపత్తు సమయంలో ఆదుకునేందుకు ముందుకు వచ్చిన త్రిషకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధిత కుటుంబానికి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News