నాగర్‌కర్నూల్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు
ఉపాధ్యాయుడు ఇమ్రాన్ ను విధుల నుంచి తొలగింపు, విచారణకు ఆదేశం
నాగర్‌కర్నూల్,: జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడి పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి.పాఠశాలలో పనిచేస్తున్న ఉర్దూ ఉపాధ్యాయుడు ఇమ్రాన్‌పై కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.విద్యార్థులు ఇంటికి వచ్చి విషయం చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులు అందడంతో పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది.ప్రిన్సిపాల్ వెంటనే ఉన్నతాధికారులకు వివరాలతో కూడిన నివేదిక సమర్పించారు.ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఉపాధ్యాయుడు ఇమ్రాన్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించారు.ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.విద్యార్థుల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.ఈ ఘటనతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాల ఎదుట గుమిగూడి,విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని,పాఠశాలల్లో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు.ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, వాస్తవాలు తేలిన తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
