ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా మేతరి శంకర్ ఎన్నిక
- మర్రిగూడ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
- హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
- నల్గొండ జిల్లా అధ్యక్షుడు గాదె రాజశేఖర్ రెడ్డి
నల్గొండ :మర్రిగూడ మండలం:ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఆదేశాల మేరకు గురువారం మర్రిగూడ మండల కేంద్రంలోని ఎల్‌ఎమ్‌జి ఫంక్షన్ హాల్‌లో మర్రిగూడ మండల ఉపసర్పంచ్‌ల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఫోరం నల్గొండ జిల్లా అధ్యక్షుడు గాదె రాజశేఖర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంభం వేణుగోపాలరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రిగూడ మండల ఉపసర్పంచ్‌ల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా మహేశ్వరం రమేష్,అధ్యక్షులుగా మేతరి శంకర్,ఉపాధ్యక్షులుగా ఎలగపల్లి లింగయ్య,ప్రధాన కార్యదర్శిగా ముద్దం శ్రీలత శ్రీధర్ గౌడ్,సహాయ కార్యదర్శిగా కొర్ర సునీత శంకర్ నాయక్,కోశాధికారిగా కొయ్య మేల్కీ,ప్రచార కార్యదర్శిగా రమావత్ శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు నిరంతర పోరాటం
జిల్లా అధ్యక్షుడు గాదె రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధిలో ఉపసర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధుల సమస్యల పరిష్కారం కోసం, వారికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుల సాధన కోసం ఫోరం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఫోరం తరఫున పలు కీలక డిమాండ్లను ప్రస్తావించారు ఉపసర్పంచ్‌లకు గౌరవ వేతనం చెల్లించాలని,ప్రభుత్వ అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉపసర్పంచ్‌ల పేర్లను తప్పనిసరిగా ముద్రించాలని,గ్రామ పంచాయతీ తీర్మానాలపై ఉపసర్పంచ్‌ల సంతకాలు తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకోవాన్నారు.
సమస్యల పరిష్కారానికి శ్రమిస్తా: మేతరి శంకర్
నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఫోరం మర్రిగూడ మండల అధ్యక్షుడు మేతరి శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు మండల ఉపసర్పంచ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపసర్పంచ్‌ల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని, గ్రామాల్లో ఎదురవుతున్న అభివృద్ధి సవాళ్లపై నిరంతరం నిలబడతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల పరిధిలోని వివిధ గ్రామాల ఉపసర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు నాయకులు,గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.
Views: 580
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
