బెల్లంపల్లిలో మహిళ అదృశ్యం

బెల్లంపల్లిలో మహిళ అదృశ్యం

బెల్లంపల్లి / మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలోని బజార్‌ ఏరియాకు చెందిన వడ్ల @ దేవరకొండ సంగీత (30) అదృశ్యమైనట్లు బెల్లంపల్లి వన్‌టౌన్‌ సీఐ కె శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ నెల 8న ఉదయం 10.30 గంటలకు హనుమాన్‌ ఆలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాలేదని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోందని తెలిపారు. సంగీత 5 అడుగుల ఎత్తు, తెలుపు ఛాయతో ఉంటుందని, నీలం-తెలుపు రంగు టాప్‌, ఆస్‌ రంగు చున్నీ, తెలుపు లెగ్గిన్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు వివరించారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మహిళ అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 8712656559, 9440521677, 872580669, 9704160903 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌హెచ్‌ఓ కె. శ్రీనివాస్‌రావు కోరారు.
Views: 395

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News