కొత్త డిటిఆర్ లను ఏర్పాటు చేస్తాం
మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత
పరిగి,(వికారాబాద్ ): పరిగి మున్సిపల్ పరిధిలోని కొన్ని వార్డుల్లో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపా లిటీ చర్యలు చేపడుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ తెలిపారు. పట్టణంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ వార్డులోనైనా లో వోల్టేజ్ సమస్య ఉంటే వెంటనే మున్సిపల్ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి, అవసరమైన చోట్ల కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్ లను) ఏర్పాటు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరిగి నియోజకవర్గ అభివృద్ధికి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఆయన సహకారంతో పరిగి పట్టణంలో విద్యుత్, తాగునీరు, రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను సంకోచం లేకుండా మున్సిపల్ కార్యాలయానికి తెలియజే యాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
