కె.జి.బి.వి పనుల పురోగతిపై సమీక్ష
– అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశాలు
మహబూబ్ నగర్, : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కె.జి.బి.వి) చేపడుతున్న సివిల్ పనుల పురోగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కె.జి.బి.వి ల్లో కొనసాగుతున్న పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలోEWIDC డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, కె.జి.బి.వి ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


