దేవరకద్ర గురుకుల కళాశాల, హాస్టల్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
మహబూబ్‌నగర్, :దేవరకద్ర మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ (TGSWRS) జూనియర్ కళాశాల మరియు హాస్టల్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా వంటగది పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, మౌలిక వసతులు, హాస్టల్ సేవలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, హాస్టల్ సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు, అవసరాలను తెలుసుకున్న అదనపు కలెక్టర్ వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, ఆహార నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలని, విద్యా, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆయన సూచించారు. ఈ తనిఖీలో దేవరకద్ర ఎం.పి.ఓ, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


