మద్దులపల్లి లో క్షుద్ర పూజల కలకలం
కాటారం (భూపాలపల్లి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి గ్రామంలో క్షుద్ర పూజల విషయం కలకలం రేపింది. బుధవారం అమావాస్య కావడంతో అర్ధరాత్రి మద్దులపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులోని రోడ్లపై తెల్లటి ముగ్గుతో నిమ్మకాయలు, జీడిగింజలు తదితర వస్తువులతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. గురువారం ఈ విషయం గ్రామంలో వ్యాప్తి చెందడంతో ప్రజలు బెంబలెత్తిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు తీస్తున్న నేటి ఆధునిక సమాజంలో క్షుద్ర పూజలు జరుగుతుండడం పట్ల ప్రజలు భయకంపితులవుతున్నారు. గ్రామంలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద, ముప్పు వాటిల్లుతుందోనని భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
