బద్రిగూడెం అనిత కుటుంబానికి త్రిష ఆర్థిక సాయం
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని బద్రిగూడెం గ్రామానికి చెందిన అనిత ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కుమార్తె త్రిష మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించారు. అనిత అంత్యక్రియల ఖర్చుల కోసం తన వంతుగా ₹15,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.అంత్యక్రియల అనంతరం అనిత కుటుంబ సభ్యులను పరామర్శించిన త్రిష, వారికి ధైర్యం చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
