వెల్దుర్తికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలి

గ్రామ యువత ఉద్యమం

వెల్దుర్తికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలి


మెదక్: వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఇక్కడ సరిపడా  వసతులు లేవన్న కారణంతో పక్క గ్రామానికి తరలించే ప్రయత్నాలను గ్రామ యువత తీవ్రంగా ఖండించారు.మండల కేంద్రమైన వెల్దుర్తికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం పట్ల ప్రజలు మొదట్లో హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అధికారులు స్కూల్ ను వేరే గ్రామానికి తరలించే యోచనలో ఉన్నారని తెలిసి యువత ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా గ్రామ యువత మాట్లాడుతూ _"వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన స్కూల్ ను ఇతర గ్రామానికి తరలించడం అన్యాయం. మండలంలోని 15 గ్రామాల విద్యార్థులకు వెల్దుర్తే అనుకూలం. స్కూల్ తరలిస్తే పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారు. ప్రభుత్వం వెంటనే స్కూల్ ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేయాలి" అని డిమాండ్ చేశారు.అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని స్కూల్ ను వెల్దుర్తిలోనే కొనసాగించాలని కోరారు.ఈ ఆందోళనలో వెల్దుర్తి గ్రామ సర్పంచ్ దండం ఆదర్శ్ ఎలుక పల్లి గ్రామ సర్పంచ్ పావని శంకర్ వెల్దుర్తి ఉపసర్పంచ్ కమ్మరి శ్రావణ్ బీసీ సంఘం నర్సాపూర్ ఇన్చార్జి  నరేందర్ గౌడ్ బిజెపి నాయకులు శేఖర్ గౌడ్ గజం చందు కూల్ చైర్మన్ కుమ్మరి ముకుందం గజం ప్రవీణ్ కుమార్ జేఏసీ నాయకులు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1592485

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News