రాష్ట్ర స్థాయి శిక్షణకు హాజరైన 29 మంది ఎంఈవోలు
సంగారెడ్డి, : శాఖాపరమైన పరిపాలన, విద్యా నిర్వహణకు సంబంధించిన అంశాలపై గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా నుంచి 29 మంది మండల విద్యాధికారులు (ఎంఈవోలు) హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రోహిణి తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ... మండల స్థాయిలో విద్యాశాఖ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంఈవోలకు అవసరమైన అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, పాఠశాలల అభివృద్ధి, ప్రభుత్వ విద్యా పథకాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు. అలాగే సమగ్ర శిక్ష ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, వాటి పర్యవేక్షణ, పాఠశాలల నిర్వహణలో ఎంఈవోల బాధ్యతలు, ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేయడం, విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా చెప్పినట్లు వెల్లడించారు.మండల స్థాయిలో విద్యాశాఖ పరిపాలనా విధానాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, పాఠశాలల పర్యవేక్షణలో పాటించాల్సిన నిబంధనలపై కూడా అవగాహన కల్పించామన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని ఎంఈవోలకు సూచించినట్లు తెలిపారు. జిల్లా నుంచి 29 మంది ఎంఈవోలు ఈ శిక్షణకు హాజరుకావడం ద్వారా మండల స్థాయిలో పరిపాలనా సామర్థ్యం మరింత పెంపొందుతుందని డీఈవో రోహిణి ఆశాభావం వ్యక్తం చేశారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
