అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీ బిజీ గా పోచారం.
- పదిలక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు..
- 20 లక్షల వ్యయంతో నూతన నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు..
కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం, వర్ని మండలంలోని జాకోర, శంకోరా గ్రామాల లో పలు అభివృద్ధి కార్యక్రమాల కు ముఖ్య అతిథిగా హాజరై తన చేతులమీదుగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమం లో బోధన్ ఆర్డీవో శ్రీమతి విజయకుమారి, వర్ని మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాకోర గ్రామంలో ఎస్ డి ఎఫ్ నిధుల ద్వారా రూ.10 లక్షల వ్యయం తో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. జాకోర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పి ఏ సి ఎస్ ఆధ్వర్యం లో నూతనం గా నిర్మించిన దుకాణ సముదాయం ప్రహరీ గోడ ను ప్రారంభించారు. శంకోర గ్రామం లో రూ.20 లక్షల వ్యయం తో నూతనం గా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. Views: 15
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
