అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐవీ / ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎంహెచ్‌ఓ డా. ఎ. అప్పయ్య

అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐవీ / ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు

హనుమకొండ : అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్, ఎస్‌టీఐలపై నిర్వహిస్తున్న విస్తృత (ఇంటెన్సిఫైడ్) ఐఈసీ ప్రచార కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎ. అప్పయ్య  బుధవారం ప్రభుత్వ టీబీ ఆసుపత్రిలో ప్రారంభించారు.ఈ సందర్భంగా డా. ఎ. అప్పయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు డిజిటల్‌ మాధ్యమాల ద్వారా హెచ్‌ఐవీకి సంబంధించిన సమగ్ర సమాచారం, సేవలను NACO (జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) రూపొందించిన “Break Free App” ద్వారా పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా యాప్‌కు సంబంధించిన QR కోడ్ పోస్టర్‌ను అధికారులు, అతిథులు ఆవిష్కరించారు.అనంతరం అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డా. మదన్‌మోహన్ రావు మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లాలో విస్తృత స్థాయిలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 181 గ్రామాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు, సామాజిక వేత్త ఇ.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ నేటి యువత హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై సరైన సమాచారాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. అపోహలకు దూరంగా ఉండి, శాస్త్రీయమైన సమాచారాన్ని తెలుసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యువత కీలక భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ప్రభుత్వ టీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రవి, ఆర్‌ఎంఓ డా. వెంకట రమణ, డీటీసీఓ డా. ప్రదీప్ రెడ్డి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ స్వప్న మాధురి, డెమో అధికారులు అశోక్ రెడ్డి, రామకృష్ణ, కమలాకర్, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి శ్రీనివాస్, కౌన్సిలర్ రాపర్తి సురేష్, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News