పాఠశాలలకు సర్పంచ్ ఆరు నెలల వేతనం విరాళం
విద్యార్థుల సంక్షేమం, బడి వసతులకే తన జీతం: సర్పంచ్ పార్కాల రామ్‌రెడ్డి
చౌటకూర్, : గ్రామ అభివృద్ధితో పాటు విద్యారంగానికి తనవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో చౌటకూర్ మండల కేంద్రంలో సర్పంచ్ పార్కాల రామ్‌రెడ్డి తన ఆరు నెలల గౌరవ వేతనాన్ని పాఠశాలలకు విరాళంగా అందించారు. చౌటకూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 25,000, ఎంపీపీ ప్రాథమిక పాఠశాలకు రూ. 14,000 ఆర్థిక సాయాన్ని గురువారం అందజేశారు. సర్పంచ్‌గా తనకు లభించిన ఆరు నెలల గౌరవ వేతనాన్ని విద్యార్థుల అవసరాల కోసం పాఠశాలలకు కేటాయించడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పార్కాల రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకోసారితనకు వచ్చే జీతం మొత్తాన్ని గ్రామంలోని పాఠశాలల వసతులకు, విద్యార్థుల సంక్షేమానికి మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సాయంగా అందిస్తానని తెలిపారు. గ్రామంలో విద్య, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ చౌటకూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్థుల సహకారంతో అన్ని రంగాల్లో ఊరిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీవో సువర్ణ, పంచాయతీ కార్యదర్శుల సందీప్ గౌడ్, రామా గౌడ్, వర్కల రమేష్, వార్డు నెంబర్ అశోక్, చక్రపాణి, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, సుభాష్ బాబు, ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Views: 213
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
