స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ
పరిగి మున్సిపల్ కమిషనర్ కావటి మల్లేష్ యాదవ్
పరిగి,(వికారాబాద్ ): స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని పరిగి మున్సిపల్ కమిషనర్ కావటి మల్లేష్ యాదవ్ అన్నారు. గురువారం పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్, సుల్తాన్‌పూర్ తండా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కిట్స్ (బ్యాగులు, మ్యాట్లు, చెప్పులు) పంపిణీ చేశారు. స్థానిక కౌన్సిలర్ తుమ్మలబావి సునీత శశాంక్ రెడ్డి, అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్ కుమార్‌తో కలిసి కమిషనర్ మల్లేష్ యాదవ్ విద్యార్థులకు కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థి దశ భవిష్యత్తుకు పునాది వంటిదని, క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారిలో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు అంకిత స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉంటారని, వారిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు అండగా నిలిచి, వారి చదువుకు ప్రోత్సాహం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. విద్యార్థులు అందుకున్న బ్యాగులు, మ్యాట్లు, చెప్పులను సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం కౌన్సిలర్ తుమ్మలబావి సునీత శశాంక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ప్రత్యేక శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యకు ఉన్న ప్రాధాన్యత మరేదానికీ లేదన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారు ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలని కోరారు. తమ వార్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్స్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని కౌన్సిలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సుల్తాన్‌పూర్ తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, అంకిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
