ఆలయంలో జీఎం షాలెం రాజుకు ఘన సన్మానం
కొత్తగూడెం : రామవరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ చమన్ పార్క్‌లో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌ను శుక్రవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు జీఎం షాలెం రాజును ఆలయానికి సాదరంగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోఆలయ కమిటీ సభ్యులు పురమ ఫణికుమార్, పితాని సత్యనారాయణ, వంగ వెంకటేశ్వరరావు, జూపాక రమేష్, బచ్చలకూరి రఘు, గ్రంధి రంగసాయిలు, నగేష్ తదితరులు పాల్గొని జీఎంను సన్మానించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


