మర్పల్లి లో విరబూసిన బ్రహ్మకమలం

మర్పల్లి లో విరబూసిన బ్రహ్మకమలం

మర్పల్లి,(వికారాబాద్): మండల కేంద్రంలోని సిద్దాపురం మానెమ్మ ఇంటి ఆవరణలో అరుదుగా పూసే బ్రహ్మకమలం పుష్పం బుధవారం రాత్రి విరబూసింది. తెల్లని రేకులతో అందంగా వికసించిన బ్రహ్మకమలాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.అరుదుగా పూసే ఈ పుష్పం విరబూయడంతో మానెమ్మ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పుష్పాన్ని భక్తిశ్రద్ధలతో దేవుడి చెంతకు చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మకమలం పూయడం శుభసూచకంగా భావిస్తామని వారు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు ఇంటికి చేరుకుని వికసించిన బ్రహ్మకమలాన్ని ఆసక్తిగా తిలకించారు. 
Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News