చాదర్ సమర్పించిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ 

చాదర్ సమర్పించిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ 

హన్మకొండ: కాజీపేట దర్గా హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబాని రహ్మతుల్లాహి అలైహి ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్  ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం దర్గాకు ఘనంగా 'చాదర్' సమర్పించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మైనార్టీ విభాగం నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి నాయకులు, కార్యకర్తలు భక్తిశ్రద్ధల నడుమ చాదర్‌ను కాజీపేట దర్గాకు తరలించారు. దర్గా వద్ద వినయ్ భాస్కర్  చాదర్ సమర్పించి, ప్రత్యేక దుఆ (ప్రార్థన) చేశారు.ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్  మాట్లాడుతూ కాజీపేట దర్గా సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందనన్నారు.సమాజంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా జీవించాలని ప్రార్థించామని తెలిపారు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల మధ్య సోదరభావం మరింత పెంపొందాలని కోరుకున్నామని అన్నారు  ప్రతి ఏటా ఈ ఉత్సవాల్లో పాల్గొని చాదర్ సమర్పించడం ఒక సాంప్రదాయంగా వస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News