పోలీసు సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరం
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
రూ.8 లక్షలతో నూతన ఇండోర్ షటిల్ కోర్టు ప్రారంభం
నాగర్‌కర్నూల్ : విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న తీవ్ర పని ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు.జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును కలెక్టర్,ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం,ఏకాగ్రత పెరుగుతాయన్నారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహించే పోలీసులు ఆరోగ్యంగా,ఉత్సాహంగా ఉంటే విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయగలరని పేర్కొన్నారు. అందుకే పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడలను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ మాట్లాడుతూ,శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రీడలు ఉపయోగకరమన్నారు. నూతన కోర్టు ఏర్పాటుకు సహకరించిన కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్,ఎస్పీ,ఇతర అధికారులు నూతన షటిల్ కోర్టులో స్వయంగా బ్యాడ్మింటన్ ఆడి సిబ్బందిలో ఉత్సాహం నింపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Views: 43
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
