సమ సమాజ నిర్మాణమే ఎర్రజెండా అంతిమ లక్ష్యం

సమ సమాజ నిర్మాణమే ఎర్రజెండా అంతిమ లక్ష్యం

  • ప్రశ్నించే గొంతే కమ్యూనిజం 
  • దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం 
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.

నాగర్ కర్నూల్ :   కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈనెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు సాగే ఈ ప్రజా పోరు యాత్ర నేడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్యం బాల నరసింహా హాజరై మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని గ్రామాలు పట్టణ కేంద్రాలలో సిపిఐ పాదయాత్రలు, ప్రచార యాత్రలు కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులకు పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోవడం వలన ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద లక్షలాదిమంది విద్యార్థుల ఉద్యమాలతోనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని ఆయన అన్నారు. కానీ నిన్న బిజెపి ఎంపీ కంగనా రౌనత్ విద్యార్థి ఉద్యమాలపై అనుచిత వాక్యాలు చేయడం సరైనది కాదని విద్యార్థులు సిజెపి అని ఒక సోషల్ మీడియా ద్వారా దగ్గరై ఉద్యమాలు చేస్తుంటే వారిని బొద్దింకలు అనడం అవి మురికి మోరీలలో ఉంటాయని అనడం బొద్దింకలు అని చెప్పుకునేవారు బెట్టింగ్లకు వ్యసనాలకు పాల్పడుతూ ఉంటారని అసలైన విద్యార్థులు అయితే ఇలా బొద్దింకలమని చెప్పుకోరు అని ఆమె అన్నారు ఆమె మాటలు వెనక్కి తీసుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండి 12 సంవత్సరాల అవుతున్న నేటి వరకు ఒక నిరుపేదలకు ఈ ఇండ్లు గాని ఇళ్ల స్థలాలు గాని ఇవ్వలేదని రైతులకు సరైన మద్దతు ధర , అయ్యా రంగాలలో పనిచేసే ఉద్యోగులు కు కనీస వేతనాలు కూడా లేవని దేశ సంపాదన మొత్తం లూటీ చేసుకొని బిజెపికి అనుకూలంగా ఉన్న వ్యాపారవేత్తలకే కట్టబెడుతుందని ఆయన దుయ్యబట్టారు . రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన హామీలను నెరవేర్చకుండా రైతుల భూ సమస్యలను పరిష్కరించకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మూడు సంవత్సరాలు కాలయాపన చేస్తూ వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ జి , సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కె కేశవులు గౌడ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తన్నీరు నరసింహ, ఈర్ల చంద్రమౌళి,కౌన్సిల్ సభ్యులు పి కృష్ణాజి , మర్యాద వెంకటయ్య , తన్నీరు మల్లయ్య , మారేడు శివశంకర్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు తన్నీరు మల్లయ్య, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మాడుగుల నరసింహ, నాగర్ కర్నూల్ పట్టణ కార్యదర్శి కొత్త రామస్వామి,DHPS జిల్లా కౌన్సిల్ వాంకేశ్వరం శ్రీనివాసులు, కొట్ర శేఖర్, ఎం, ఆంజనేయులు, విజయ్, చెన్నయ్య కళాకారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News