భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: సిర్గాపూర్ పోలీసులు

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: సిర్గాపూర్ పోలీసులు

సిర్గాపూర్: మండలంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిర్గాపూర్ పోలీసులు హెచ్చరించారు. వర్షాల ప్రభావంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నారులను ఇళ్ల బయటకు వెళ్లనీయకుండా పర్యవేక్షించాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న లేదా కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.నల్లవాగు అలుగు తెగే పరిస్థితి నెలకొన్నందున ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లరాదని, ముఖ్యంగా పిల్లలు, యువకులు వాగు వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ మోటార్ల సమీపంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు తెలిపారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్–100కు సమాచారం అందించాలని సిర్గాపూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు