సారు మా ఊరికి ఆర్టీసీ బస్సు నడపండి.

సారు మా ఊరికి ఆర్టీసీ బస్సు నడపండి.

- కామారెడ్డి డి ఎం దినేష్ కుమార్ కు వినతి పత్రం అందించిన సీతారాంపూర్ సర్పంచ్ నత్తి సంజీవ్, విద్యార్థులు
- మండల కేంద్రం కు కూతవేటు దూరంలో ఉన్న గ్రామానికి రవాణా సౌకర్యం సున్నా!
- వినతి పత్రం కు సానుకూలంగా స్పందించిన డి ఎం దినేష్ కుమార్

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారు, బుధవారం సర్పంచ్ నత్తి సంజీవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజాప్రతితులు గ్రామస్తులు కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ కుమార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దోమకొండ మండల కేంద్రంకు కుతవెటు దూరంలో ఉన్న గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులకు, గ్రామస్తులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మాత్రమే ఆర్టిసి బస్సు సౌకర్యం ఉందని, ఆదివారం వస్తే ఆర్టిసి కి సెలవుగా మారిందన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ గా పని చేసిన సత్యనారా యణ ఆదేశాల మేరకు మొదట ఉదయం సాయంత్రం రెండు ట్రిప్పులను కచ్చితంగా నడపాల్సిందేనని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించారు. అప్పటినుండి రెండు ట్రిప్పులు మాత్రమే నడుస్తున్న, ఆదివారం వస్తే సీతారాంపూర్ గ్రామానికి ఆర్టిసి బస్సు సౌకర్యం ఉండదు, దీంతో సెలవు రోజు కావడం విద్యార్థులు, బంధువుల ఇంటికి ఇతర శుభకార్యాలకు వెళ్లాలంటే సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నరు. ఇదే విషయంపై ఆర్టీసీ అధికారులకు పలు పలుమార్లు బస్సు సౌకర్యం కల్పించాలని కోరిన స్పందించలేదు, బుధవారం విద్యార్థులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు జిల్లా కేంద్రంలో  డిపోకు చేరుకొని డి ఎం కు వినతిపత్రం అందించారు. వినతిపత్రం స్వీకరించిన డిఎం సీతారాంపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కొరకు ప్రయత్నిస్తానని అన్నారు. గ్రామస్తులు ప్రతిరోజు గ్రామానికి ఐదు ట్రిప్పులు నడిచేలా చూడాలని డీఎం ను కోరారు. సీతారాంపూర్, సంగమేశ్వర్, కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి వరకు నడుస్తున్న రెండు బస్సుల్లో ఒక బస్సును దోమకొండ వయా సీతారాంపూర్ మీదుగా నడపాలని డి ఎం నువారు కోరారు.ఉదయం ఐదు గంటలకు, విద్యార్థుల కోసం ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం రెండు గంటలకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు దోమకొండ వయా సీతారాంపూర్ మీదుగా బస్సు నడపాల్సిందిగా గ్రామస్తులు డీఎంకు వివరించారు. పూర్తి సమాచారాన్ని తెలుసుకొని గ్రామస్తులకు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా బస్సు సౌకర్యం కల్పిస్తామని డి ఎం దినేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నత్తి సంజీవ్, ఉప సర్పంచ్ పద్మా లింగాగౌడ్, గ్రామస్తులు సంతోష్ రెడ్డి, అంజా గౌడ్, నత్తి శంకర్, కొలుపుల రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News