ప్రజల అభిష్టం మేరకు ఆలయ కమిటీ పాలకవర్గం
అనంత పద్మనాభ స్వామి ఆలయ చైర్మన్ లక్ష్మయ్య
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ ప్రజల అభిష్టం మేరకు శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ కమిటీ పాలకవర్గం కొనసాగుతుందని చైర్మన్ భానూరి లక్ష్మయ్య తెలిపారు. గురువారం నాడాయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆలయ కమిటీ నూతన పాలకవర్గం ఏర్పాటై ఏడాది 8 నెలలు అయిందన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆశీస్సులు, కాంగ్రెస్ గ్రామ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఆలయ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయ కమిటీ పాలకవర్గం పదవీ కాలం ముగిసిందని, కొందరు ప్రచారం చేస్తున్నారని, గడువు ముగిసినప్పటికీ, మంత్రి సహకారంతో పాలకవర్గం పదవిలో కొనసాగుతుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామంలో పటిష్టం చేయడంతో పాటు గత ఏడాది డిసెంబరులో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు గెలుపొందేలా ఆలయ కమిటీ పాలకవర్గం ఆహర్నిశలు పని చేసిందని గుర్తు చేశారు. ఏడాదిన్నర కాలంలో ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని పేర్కొన్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ధ్వజస్తంభ ప్రతిష్టింపజేసి వార్షిక బ్రహోత్మవాలను అంగరంగ వైభంగా నిర్వహించామ న్నారు. ఆలయం ఎదురుగా ఖాళీ స్థలంలో మొరం, మట్టి పోయించి గుంతలుగా ఉన్న స్థలాన్ని చదును చేశామన్నారు. వాహహనాలు నిలిపేందుకు పార్కింగ్, గార్డెనింగ్, మొక్కలు నాటి ఆలయ పరిసరాలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నూతన పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టాక ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని చైర్మన్ భానూరి లక్ష్మయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వంలో దామోదర రాజనరసింహ మంత్రిగా కొనసాగినంతకాలం ఆలయ కమిటీ పాలకవర్గం మనుగడలో ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేని కొంత మంది షార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Views: 110
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
