ఎమ్మెల్సీ చేతుల మీదుగా 'స్నేహితుల దినోత్సవం' ప్రత్యేక పాట ఆవిష్కరణ

ఎమ్మెల్సీ  చేతుల మీదుగా 'స్నేహితుల దినోత్సవం' ప్రత్యేక పాట ఆవిష్కరణ

గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో "స్నేహితుల దినోత్సవం" పురస్కరించుకుని గేయ రచయిత రాయారావు విశ్వేశ్వరరావు రూపొందించిన ప్రత్యేక పాటను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి మాట్లాడుతూ గేయ రచయిత రాయారావు విశ్వేశ్వరరావు రాసిన పాటలు ఎంతో అద్భుతంగా, శ్రోతలను ఆకట్టుకునేలా ఉన్నాయని కొనియాడారు. సమాజంలో స్నేహానికి ఉన్న విలువను, స్నేహితుల మధ్య ఉండే ప్రేమానురాగాలను చాలా చక్కగా ఈ పాటలో వర్ణించారని ప్రశంసించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి, మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు గోలి సంతోష్, ఆపన్న హస్తం మిత్రబృందం సభ్యులు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కుమార స్వామి, గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య అధ్యక్షులు శంకర్ శర్మ, కోశాధికారి కృష్ణ మూర్తి శర్మ, రాజేశ్వర్, శరత్, తదితరులు పాల్గొన్నారు.
Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు