పులిచింతలకు మొదలైన ఇన్ ఫ్లో
చింతలపాలెం (సూర్యాపేట) : ఎగువ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో స్వల్పంగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో తొలిసారిగా ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది కొంత ఊరటనిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 27.9100 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 162.006 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి 3,420 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, లీకేజీల ద్వారా 400 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదయింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


