ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం హనుమంత్ రెడ్డి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 276 ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, 294 బహదూర్‌పల్లి డివిజన్ అధ్యక్షులు మైసిగారి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలేటి శ్రీనివాస్, రామచందర్, రవి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


