అక్టోబర్ 4న చలో ఓయూ.. మహాధర్నా
మిడ్జిల్, : మాల నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, రోస్టర్ విధానాన్ని సరైన పద్ధతిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 4, 2026న ఆదివారం “చలో ఉస్మానియా యూనివర్సిటీ” కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాల మహానాడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్చర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మాల విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేత, మాల మహానాడు మిడ్జిల్ పెరుమాళ్ల జంగయ్య, ఓయూ జేఏసీ సభ్యులు రాహుల్, పండుగ భాను, నామ సైదులు, అరుణ్, కోడిగంటి నందన్, అనిల్, ఆంజనేయులు, పెరుమాళ్ల సాయి సూర్య, లక్మల్ల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


