కరెంటు కోతలను ఆపి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి

కరెంటు కోతలను ఆపి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి

సిపిఐ(ఎం) మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి

నాంపల్లి మండల కేంద్రంలో సిపిఐ(ఎం) నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో కరెంటు కార్యాలయం ముందు నిరసన తెలిపి లైన్ ఇన్స్పెక్టర్ రెడ్డిమల్ల బిక్షం కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ(ఎం) మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ కరెంట్ కోతలు నివారించి 12 గంటల నాణ్యమైన కరెంట్ ఇప్పించి ఎండుతున్న పంటలను కాపాడి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నాంపల్లి మండల రైతాంగం కరెంటు కోతలతో మోటర్లు కాలిపోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కరెంటు సరిగ రాక మోటర్లు కాలిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఎల్ నిన్ ప్రభావంతో వర్షాలు సరిగా పడక బోర్ల కింద వేసిన వరి మరియు ఆరుతడి, పత్తి ఇతర పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి అని ఆయన తెలిపారు. వీటిని కాపాడుకోవడం కోసం బోర్లు వేసి దక్కించుకుందామంటే కరెంటు సరిగా రాక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు అని అన్నారు.గత ప్రభుత్వం 17 గంటల కరెంటు నిరంతరాయంగా ఇస్తే ఇప్పుడు కనీసం 10 గంటలు కూడా రావడం లేదు దీనితో రైతుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం రైతు సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పిన ప్రభుత్వం కరెంటు ఇవ్వడంలో విఫలమవుతుందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరెంటు కోతలు నివారించి 12 గంటల నాణ్యమైన కరెంటు రైతాంగానికి ఇచ్చి పంటలను కాపాడాలని  ప్రభుత్వాన్నికోరుతున్నాము. ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, రైతులు కట్ట బోయిన శ్రీను కట్టబోయిన ముత్తయ్య బీరం వెంకట్ రెడ్డి గిరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని