రూ.12 కోట్లతో పరారైన వ్యక్తి ఇంట్లో పోలీసుల తనిఖీలు
అధిక వడ్డీ ఆశ చూపి మోసం - బాధితుల ఆరోపణ
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రూ.12 కోట్లతో పరారైన వ్యక్తి ఇంట్లో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు.పట్టణంలోని సాయినగర్ కాలనీకి చెందిన ఎండి. సలీం అధిక వడ్డీ ఆశ చూపి పలువురి నుంచి సుమారు రూ.12 కోట్లు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. గురువారం ఇంట్లో చెప్పాపెట్టకుండా సలీం పరారైనట్లు బాధితులు తెలిపారు.బాధితులు శేఖర్, వరలక్ష్మి, కవిత, దుర్గాబాయి తదితరులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై నరేష్, సిబ్బంది నిందితుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


