బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

నిర్మల్ జిల్లా : పదవ తరగతి బోర్డు పరీక్షలకు విద్యార్థులంతా ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికలతో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులతో కలిసి పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులందరికీ మెనూ ప్రకారం అన్ని వేళల్లో నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి కల్పిస్తూ, మెరుగైన విద్యను అందించాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ పూర్తి సంఖ్యలో ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న భోజనం, విద్య తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.   అనంతరం పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ, వారికి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా, అన్ని వసతులు కల్పిస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల్లో సిలబస్ ఎంతవరకు పూర్తయిందో అడిగారు. విద్యార్థులందరూ బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ప్రతి సబ్జెక్టుకు తగిన సమయం కేటాయించి, ప్రణాళిక ప్రకారం చదివి, బోర్డు పరీక్షల్లో సత్తా చాటాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. సబ్జెక్టుల్లో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులందరూ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు.   బోర్డుపై విద్యార్థులతో గణిత సమస్యలను సాధింపజేశారు. లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, వారికి పెన్నులను బహుమతులుగా ఇచ్చి వారిలో ఉత్సాహం నింపారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ సంతోష్, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

WhatsApp Image 2026-09-25 at 4.52.09 PM

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని